: సల్మాన్, సంజయ్ జీవితం.. ఇప్పుడో డాక్యుమెంటరీ


పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు ఆరాధ్యులైన బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ల జీవితం త్వరలో డాక్యుమెంటరీగా రాబోతుంది. కొన్నాళ్ల నుంచి పలు కేసులు ఎదుర్కొంటున్న వీరి జీవితాల్లోని చీకటి కోణాల ఆధారంగా రచయిత ముజామ్ బేగ్ ఈ డాక్యుమెంటరీని రూపొందించబోతున్నాడు. 'మున్నాభాయ్-సల్లూభాయ్ హీలర్స్' పేరుతో డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నారు.

దీనిపై దర్శకుడు ముజామ్ మాట్లాడుతూ.. 'ఈ చిత్రం ద్వారా సల్మాన్, సంజయ్ ల జీవిత ప్రస్థానంలోని ఎత్తుపల్లాలను చూపించబోతున్నాను. చిత్ర రంగంలో వారు కెరీర్ ను ప్రారంభించినప్పటినుంచి సామాజిక, మానసిక, ఆర్ధిక జీవితాన్ని ఇందులో చూపించబోతున్నాము.ఈ ప్రాజెక్టుకు ఓ సీనియర్ జర్నలిస్టు సహాయం అందిస్తున్నారు' అని చెప్పాడు. ఈ డాక్యుమెంటరీని దర్శకుడి ఆధ్వర్యంలోని 'ఏజీస్' అనే స్వచ్ఛంద సంస్థ నిర్మిస్తోంది. 2011లో హీరో రణబీర్ కపూర్ నటించిన 'రాక్ స్టార్' చిత్రానికి ముజామ్ రచయితగా వ్యవహరించాడు.

  • Loading...

More Telugu News