: క్రికెట్ బంతికోసం వెళితే శవం కనిపించింది!
హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో కొందరు పిల్లలు క్రికెట్ బంతి కోసం ముళ్ళపొదల్లో వెతుకుతుండగా శవం కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. ఆ మృతదేహం మర్మావయవాలు కోసిన స్థితిలో అత్యంత భయానకంగా ఉంది. గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చిన ఆధారాలు కనిపించాయి. ఈ ఘటన ఉప్పల్ హనుమసాయినగర్ వాసుల్లో అలజడి రేపింది. సమాచారమందుకున్న పోలీసులు క్రికెట్ మైదానం వద్దకు వచ్చి పరిశీలించారు.
ఒంటిపై తేలికపాటి గాయాలే ఉన్నాయని, అయితే, మర్మాంగం కోసి ఉందని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రమే అతడిని హత్య చేసి క్రికెట్ మైదానం సమీపంలో పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.