: మహారాష్ట్ర హోం మంత్రి కర్ణాటకలో బుక్కయ్యారు!
మహారాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ ను అరెస్టు చేసేందుకు కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కిందటి ఆదివారం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బెల్గాంలో ఓ మరాఠీ పత్రిక ప్రారంభోత్సవ సభలో పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అరెస్టు వారంట్ జారీకి కారణమైంది. బెల్గాం ప్రాంతం కర్ణాటకలో ఉన్నా ఇక్కడ మరాఠీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. పత్రికను ప్రారంభించే వేళ ఆయన విద్వేషపూరితంగా వ్యాఖ్యానించారని పోలీసులు పాటిల్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను పాటిల్ ఖండించారు.