: నేపాల్, నెదర్లాండ్స్ జట్లకు 'టీ20' హోదా
అనుబంధ సభ్య దేశాల్లోనూ క్రికెట్ పరిపుష్టికి ఐసీసీ తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నేపాల్, నెదర్లాండ్స్ లకు అంతర్జాతీయ టీ20 జట్ల హోదా అందించింది. నేడు మెల్బోర్న్ లో సమావేశమైన ఐసీసీ కార్యవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు దేశాలు ఇటీవలే బంగ్లాదేశ్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఐసీసీ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ టీ20 హోదా కలిగిన జట్ల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.