: రెండ్రోజుల్లో షూటింగ్ కు హాజరవుతా: అంజలి


మూడ్రోజుల క్రితం హోటల్ గది నుంచి అదృశ్యమైన హీరోయిన్ అంజలి మరో రెండ్రోజుల్లో షూటింగ్ కు హాజరవుతానని తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం ఆమె తన సినిమాల నిర్మాతలతో ఫోన్ లో మాట్లాడింది. ఇక నుంచి షూటింగ్ లకు ఎలాంటి ఆటంకం కలిగించనని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈరోజు ఉదయం తన సోదరుడు రవిశంకర్ తో ఫోన్ లో మాట్లాడిన అంజలి.. నిర్మాతలు సురేష్ బాబు, స్రవంతి రవికిశోర్ లతో ఫోన్ లో మాట్లాడతానని చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News