: కామినేని ఆసుపత్రిలో రేపు షోల్డర్ ఆర్థ్రోస్కోపి పై సెమినార్
హైదరాబాదు ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో ఈ నెల 29వ తేదీన (ఆదివారం) షోల్డర్ ఆర్థ్రోస్కోపి, కాడవరిక్ సదస్సు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు జి. సత్యనారాయణ, పి.ఎస్.జయప్రసాద్ తెలిపారు. కామినేని ఆసుపత్రి, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరుగుతోందని వారు వెల్లడించారు. అధునాతన వైద్య విధానాలపై నిష్ణాతులైన వైద్యుల ఉపన్యాసాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించి, సమస్యలకు పరిష్కారం చూపుతారని వారు చెప్పారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన వారు పేర్లు నమోదు చేసుకోవాలని వారు సూచించారు.