: రైతులను మోసం చేస్తే...సర్వనాశనమే: అంబటి
రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వమైనా, రాజకీయ పార్టీ అయినా సర్వనాశనం కావాల్సిందేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా రైతులు రుణాలు కట్టొద్దంటూ టీడీపీ అధినేత పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అయితే, రుణమాఫీపై ఇప్పటి వరకు ఏం చేశారో చంద్రబాబునాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
'ఖరీఫ్ ప్రారంభమైంది... రైతులు అయోమయంలో ఉన్నారు' అని అంబటి అన్నారు. బ్యాంకు అధికారులు అప్పులు తీర్చాలంటూ రైతుల వెంటపడుతున్నారని ఆయన చెప్పారు. వరి మద్దతు ధరపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాలయాపన చేయకుండా రైతు రుణమాఫీ చేయాలని సూచించారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.