: 'నమస్తే తెలంగాణ' పత్రిక ఛైర్మన్ గా కేసీఆర్ అనుయాయుడు


'నమస్తే తెలంగాణ' పత్రిక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సీ.ఎల్.రాజం రాజీనామా చేశారు. నిర్వహణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సహాయకుడైన దామోదర్ రావుకు అప్పగించారు. ఈ మేరకు పత్రిక కార్యాలయంలో మొన్న (గురువారం) ఓ కార్యక్రమంలో రాజం మాట్లాడుతూ, పత్రికలోని మెజారిటీ షేర్లను తన వద్దే పెట్టుకోవాలని గతంలో అనుకున్నానని... అయితే ఇతర కార్యక్రమాల్లో బిజీ కావడం వల్ల మెజారిటీ వాటాను బదిలీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దీంతో, మెజారిటీ వాటా దామోదర్ కు బదిలీ చేసినట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల తర్వాత పత్రిక బాధ్యతల నుంచి ఆయన వైదొలగటం గమనార్హం. రాజం నుంచి మెజరిటీ వాటా బదిలీ కావడంతో ఇకపై 'నమస్తే తెలంగాణ' సీఎండీగా దామోదర్ వ్యవహరిస్తారు. ఇదిలాఉంటే కొన్ని రోజుల కిందట రాజం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News