: మా జీతాలు 11 కాదు... 25 శాతం పెంచాల్సిందే: బ్యాంకు యూనియన్లు


ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ) ప్రతినిధులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో కలిశారు. భారత బ్యాంకుల సంఘం ఆఫర్ చేసిన 11 శాతం పెంపు సరిపోదని, వేతనాన్ని 25 శాతం పెంచాల్సిందేనని యూనియన్లు జైట్లీకి వివరించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వేతన సవరణ చేయాలని నవంబరు 2012 నుంచి బ్యాంకు యూనియన్లు కోరుతూ వస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తో చర్చలు జరుపుతున్నామని, వారు సమస్య పరిష్కారాన్ని జాప్యం చేస్తున్నారని వెంకటాచలం చెప్పారు. వారి ప్రతిపాదన (11 శాతం) మరీ తక్కువగా ఉందన్న విషయాన్ని ఇప్పటికే తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News