: ఢిల్లీలో ఇద్దరు టాంజానియా మహిళలపై అత్యాచారం


ఢిల్లీలో ఇద్దరు టాంజానియా దేశ మహిళలపై అత్యాచారం జరిగింది. తమను ఇద్దరు యువకులు ఓ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధిత మహిళలు నిన్న సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు శాస్త్రి నగర్ కు చెందిన కమల్, ఆర్కే పురానికి చెందిన సతీష్ ను అరెస్ట్ చేశారు. ఈ యువకులు సదరు మహిళలకు తెలిసినవారేనని పోలీసులు తెలిపారు. యువకులతో వారికి చిన్న గొడవ జరిగిందని, దాంతో తమను పిలిచినట్లు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News