: ఏం.. డబ్బింగ్ సీరియళ్ళు ఆపరా?: దాసరి ఆగ్రహం
తెలుగు టీవీ చానళ్ళలో డబ్బింగ్ సీరియళ్ళను నిలిపివేయాలని డిమాండు చేస్తూ టీవీ ఆర్టిస్టులు చేస్తున్న నిరాహార దీక్షకు 'దర్శకరత్న' దాసరి నారాయణరావు మద్దతు తెలిపారు. డబ్బింగ్ సీరియళ్ళను ఆపకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీరియళ్ళను ఆపివేయాలని చేస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిన దాసరి, పోరాటంలో తాము కూడా భాగస్వాములమవుతామని తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద టీవీ ఆర్టిస్టులు తమ ఆమరణ దీక్షను ప్రారంభించారు.