: ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో వెస్టిండీస్, పాకిస్తాన్ లకు చోటు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీలో వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లకు కూడా చోటు కల్పించారు. ఈ మేరకు మెల్ బోర్న్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మొత్తం ఐదు సభ్య దేశాలుంటాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ శాశ్వత సభ్యదేశాలు కాగా, మరో రెండు దేశాలకు ఏడాది ప్రాతిపదికన అవకాశం కల్పిస్తారు. కాగా, ఈ కమిటీలో దక్షిణాఫ్రికాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, అదే దేశానికి చెందిన డేవ్ రిచర్డ్సన్ పై వాత్సల్యం ప్రదర్శించారు. సీఈవోగా ఆయన పదవీకాలాన్ని రెండేళ్ళు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.