: సొంతపార్టీపై ఏకే ఆంటోనీ విమర్శలు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ సొంతపార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ లౌకికవాదం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో కేరళ పీసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందడుగు వేసే క్రమంలో ఈ అంశం కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ లౌకికవాదం పట్ల ఉన్న అభిప్రాయాలను ఓసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ఆంటోనీ నొక్కిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం అందించలేదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని తెలిపారు. ఈ అపోహలను తొలగించాలని సూచించారు. కాగా, లౌకికవాదం బాగా వేళ్ళూనుకుపోయిన కేరళలో సైతం మతతత్వ శక్తులు ప్రాబల్యం పెంచుకుంటున్నాయని ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News