: టీమిండియా ప్రాక్టీసుకు వరుణుడి మోకాలడ్డు
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం లీసెస్టర్ షైర్ తో మూడు రోజుల ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం వర్షం కురియడంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో, ఆటకు రెండోరోజు ఒక్కబంతి కూడా పడకుండానే రద్దయింది. కాగా, భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో తొలి రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లకు 333 పరుగులు చేసింది. టీమిండియా టాపార్డర్ లో అందరూ లీసెస్టర్ షైర్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని చక్కని బ్యాటింగ్ ప్రాక్టీసు అందుకున్నారు. కాగా, నేడు ఈ ప్రాక్టీసు మ్యాచ్ కు చివరిరోజు.