: ముంబయిలో బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు


ఆటగాళ్ళకు కాసుల వర్షం కురిపించే క్రికెట్ టోర్నీగా ఐపీఎల్ ఖ్యాతి తెలిసిందే. అయితే, ఈ సుసంపన్నమైన టోర్నీ బెట్టింగ్ రాయుళ్ళకూ స్వర్గధామంలా తయారైనట్టుంది. మొన్న ముంబయి ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య ముంబయిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ముగ్గురు బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ.16,860, 31 సెల్ ఫోన్లు, ఓ ఎల్సీడీ టీవీ, ఓ ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలోని ఖాన్ టవర్స్ వద్ద ఓ ఫ్లాట్ లో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News