: పైప్ లైన్ పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా, మామాడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్ లైన్ గ్యాస్ పేలుడు ఘటనపై విచారణ మొదలైంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.పి.సింగ్ నేతృత్వంలో ఘటనాస్థలిలో విచారణ జరుగుతోంది. జిల్లా కలెక్టర్, గెయిల్, ఓఎన్జీసీ ప్రతినిధుల నుంచి ఘటనకు గల కారణాలను కమిటీ బృందం అడిగి తెలుసుకుంటోంది.