: మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో ఎన్టీఆర్ సుజల స్రవంతి, రైతు రుణమాఫీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. దీనికి తోడు, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో సంభవించిన గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు దుర్ఘటనపై సమీక్ష నిర్వహించనున్నారు.