: రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు


కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మండుతున్న ఎండలు, నీటి కటకట ఇబ్బందులు తొలగిపోయే సమయం వచ్చింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో... కొస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడ కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడింది. కురవనున్న వర్షాలతో ఇరు రాష్ట్రాలలో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టనుంది.

  • Loading...

More Telugu News