: ఎల్లుండి శ్రీహరికోటకు మోడీ, చంద్రబాబు
పీఎస్ఎల్వీ-సి23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీహరికోటకు రానున్నారు. ఈ ప్రయోగం సోమవారం జరగనుంది. ఈ ప్రయోగానికి నేటి నుంచి 49 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా ఒక స్వదేశీ ఉపగ్రహం, 5 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.