: ఈ నెల30న నింగిలోకి పీఎస్ఎల్వీ- సి23
శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సి23 రాకెట్ ను ఈనెల 30న ప్రయోగించునున్నారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది. ఎల్లుండి ఉదయం 9.52 నిమిషాలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్ళనుంది. అంతకుముందు ఉదయం 9.49 నిమిషాలకు ప్రయోగించాలని భావించినా, నౌకకు ఆ సమయంలో అంతరిక్ష శకలాలు అడ్డువస్తున్నాయని శాస్త్రవేత్తలు భావించారు. దీంతో, ప్రయోగ సమయాన్ని మూడు నిమిషాలు పొడిగించారు.