: రైలు నుంచి తెలుగువారిని గెంటేసిన బీహారీలు
కాశీయాత్రకు వెళ్ళి తిరిగివస్తున్న తెలుగువారికి చేదు అనుభవం ఎదురైంది. వారణాసిలో పాట్నా-సికింద్రాబాద్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా బీహారీలు వారిపై దౌర్జన్యం చేసి సీట్లను ఆక్రమించారు. అంతేగాకుండా, వారందరినీ రైలు నుంచి గెంటివేశారు. రిజర్వేషన్ చేసుకున్నామని చెప్పినా వారి గోడు పట్టించుకున్న నాథుడే లేడు. ప్రస్తుతం వారణాసిలో 500 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసులు. తమను అధికారులు కూడా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.