: పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు అయింది. ఇప్పటికే మూడు రోజుల పాటు జరిగిన పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ను రద్దు చేసినట్లు వర్శిటీ ప్రకటించింది. ఎల్లుండి (ఆదివారం) నుంచి మళ్లీ తాజాగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఇవాళ కౌన్సిలింగ్ జరుగుతుండగా రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళనకు దిగి కౌన్సిలింగ్ ను అడ్డుకున్నారు. దాంతో వర్శిటీ అధికారులు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేశారు.