: బంగ్లా పర్యటనలో సుష్మా స్వరాజ్ కు చీరలే చీరలు
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు చీరలు బహుమతిగా వస్తున్నాయి. నిన్న బంగ్లా ప్రధానితో సమావేశం అయిన సందర్భంగా ఆమెకు సుష్మా స్వరాజ్ చీరను బహూకరించారు. దీంతో షేక్ హసీనా సుష్మా స్వరాజ్ కు కూడా ఓ చీరను బహూకరించారు. తరువాత బంగ్లా ప్రధాని సోషల్ నెట్ వర్క్ లో తన సోదరి (సుష్మా) తనకు చీరను కానుకగా ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు మాజీ ప్రధాని ఖలీదా జియాతో సమావేశమైన సుష్మా స్వరాజ్ కు ఆమె రెండు చీరలను బహూకరించారు. ఒకటి సుష్మా స్వరాజ్ కు, మరొకటి ఆమె కుమార్తెకు అని తెలిపారు.