: గ్యాస్ పైన్ లైన్ ఘటన మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం: చంద్రబాబు


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందులో గెయిల్ తరపున రూ.20 లక్షలు, రాష్ట్రం నుంచి రూ.3 లక్షలు, కేంద్రం నుంచి రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు. ఇక గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. కాగా, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని, ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని బాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News