: యూపీలో 'సమాజ్ వాదీ పెన్షన్ స్కీమ్'


అసలే అత్యాచార ఘటనలతో అల్లాడుతున్న ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం 'సమాజ్ వాదీ పెన్షన్ స్కీమ్'ను ప్రవేశ పెట్టబోతోంది. ఈ పథకంతో 40 లక్షల కుటుంబాలకు లాభం చేకూరనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ అలోక్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ, దాదాపు నలభై లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.500లు ఇస్తారని తెలిపారు. ఆ మొత్తం ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. ఈ పథకం దేశంలోనే అతి పెద్ద సామాజిక భద్రతా పథకమని, నలభై లక్షల్లో 12 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు, 10 లక్షల మంది మైనారిటీ కుటుంబాలు, 18 లక్షల ఓబీసీ కుటుంబాలు దీని ద్వారా లబ్ది పొందుతారని వివరించారు. ఈ పథకానికి జులై 15 వరకు దాఖలు చేసుకోవచ్చని, తర్వాత వాటిని పరిశీలిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News