: నన్ను పీక పిసికి అవతల పారేయమని మా అమ్మకు చెప్పారు: స్మృతి ఇరానీ


తన మనసుని తొలిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు. తాను పుట్టినప్పుడు కొంతమంది ఆడపిల్ల పుట్టిందని, జీవితాంతం బరువని అన్నారని ఆమె చెప్పారు. కొందరైతే ఏకంగా పీకపిసికి అవతల పారేయమని తన తల్లికి సలహా ఇచ్చారని ఆమె చెప్పారు. కానీ, తన తల్లి ఆ విధంగా చేయలేదు కాబట్టే తానీ స్థాయికి వచ్చానని స్మృతి వెల్లడించారు. ఆడ, మగపిల్లల మధ్య తారతమ్యాలు, వివక్ష చూపే మనస్తత్వాన్ని మార్చుకోవాలని, ఈ వివక్షను రూపుమాపడం తమ ప్రభుత్వ కర్తవ్యమని కేంద్ర మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News