: గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనపై హెచ్ఆర్ సీలో పిటిషన్


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఈ ఉదయం గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ఘటనపై మానవ హక్కుల పరిరక్షణ సంస్థ హెచ్ఆర్ సీలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. వెంటనే స్పందించిన హెచ్ఆర్ సీ, పైపులైన్ల పనులు జరిగే చోట ఫైరింజన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ ఘటనపై తూర్పు గోదావరి కలెక్టర్, ఎస్సీలకు నోటీసులు జారీ చేసింది. అంతేగాక ఘటనపై జులై 10లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News