: పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోరతాం: డీఎస్
నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని రేపు మండలి డిప్యూటీ ఛైర్మన్ ను కోరతామని చెప్పారు. పదవులు వదలకుండా పార్టీ మారడం నేరమని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ వేలు పెట్టాలని చూస్తోందని, టీఆర్ఎస్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తే మంచిదని సూచించారు. అయితే, టీఆర్ఎస్ ప్రలోభాలకు కాంగ్రెస్ నేతలు లొంగొద్దని డీఎస్ చెప్పారు.