: మరాఠాలకు రిజర్వేషన్లపై బాంబే హైకోర్టులో పిల్


ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర సర్కారు సుముఖత తెలపడంపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ నిర్ణయం చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకునేలా ఉంది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టులో న్యాయవాది కేతన్ తిరోద్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మరాఠా అనేది కులం కాదని, వారొక భాషా వర్గమేనని పిల్ లో పేర్కొన్నారు. అంతేగాక వారు మహారాష్ట్రలో ఆధిపత్య సంఘమేనని, వెనుకబడిన వారు కాదని చెబుతోంది. కాగా, రిజర్వేషన్ పరిమితి 50శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది వ్యతిరేకంగా ఉందని పేర్కొంటోంది. ఈ పిల్ పై న్యాయస్థానం శనివారం విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News