: బీజేపీలో చేరతానంటున్న శ్రీరాం సేన చీఫ్
శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మేరకు తాను కమలం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. "త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తాను. నాపై కర్ణాటక బీజేపీ నేతలు తప్పుగా మోపిన అభాండాలను వివరిస్తాను. మోడీపై నాకు నమ్మకం ఉంది. ఆయనొక మంచి నేత, దేశాన్ని అభివృద్ధి దిశ వైపు తీసుకువెళతారు. తప్పుకుండా బీజేపీలో చేరతా" అని ప్రమోద్ గోవాలో తెలిపారు. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక బీజేపీలో ఆయన చేరారు. వెంటనే ఇతర నేతల విమర్శలు, ఆరోపణల కారణంగా కొన్ని గంటలకే పార్టీ నుంచి వైదొలగారు.