: తమిళనాడులో ఉచిత సైకిళ్ళ పథకం
తమిళనాడులో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 6.44 లక్షల మంది 9వ తరగతి విద్యార్థులు లబ్ది పొందనున్నారు. వీరంతా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే. వీరిలో 2,86,400 మంది బాలురు కాగా, 3,57,600 మంది బాలికలు. ఈ పథకానికి ప్రారంభోత్సవం చేస్తూ సచివాలయంలో ముఖ్యమంత్రి జయలలిత ఏడుగురు బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ పథకానికి 230.72 కోట్లు ఖర్చు చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం.