: ఐసీసీ ఛైర్మన్ గా శ్రీనివాసన్ ఎంపికపై 'ఫికా' అసంతృప్తి


వివాదాస్పదుడైన ఎన్.శ్రీనివాసన్ ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికవడంపై 'ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్' (ఎఫీఐసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కు శ్రీని అధిపతి కావడంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. శ్రీనిపై చుట్టిముట్టిన ఆరోపణలకు పరిష్కారం లభించే వరకు ఐసీసీ వేచి ఉండాల్సిందని 'ఫికా' అధ్యక్షుడు పాల్ మార్ష్ అభిప్రాయపడ్డారు. ఆయన నియామకం నిరాశ పరిచిందనీ, ఇది జరగకుండా ఉండాల్సిందనీ అన్నారు. అటు న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ మార్టిన్ స్నేడెన్ మాత్రం శ్రీని ఎన్నిక కావడాన్ని సమర్ధిస్తున్నాడు.

  • Loading...

More Telugu News