: అలవోకగా సెమీస్ కు దూసుకెళ్ళిన సైనా


భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సిడ్నీలో ఈ ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 21-18, 21-9తో జపాన్ కు చెందిన ఎరికో హిరోసేపై అలవోకగా నెగ్గింది. ఈ మ్యాచ్ ను సైనా కేవలం 47 నిమిషాల్లోనే ముగించడం విశేషం. కాగా, సైనాకు సెమీఫైనల్లో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. చైనాకు చెందిన షిజియాన్ వాంగ్, చైనీస్ తైపే షట్లర్ జు యింగ్ తాయ్ మధ్య జరిగే మరో క్వార్టర్ ఫైనల్ విజేతతో సైనా సెమీస్ లో తలపడుతుంది. ఇక, తెలుగుతేజం పీవీ సింధు ఈ సాయంత్రం తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ తో ఆడనుంది.

  • Loading...

More Telugu News