: క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం: కామినేని
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు ప్రమాద క్షతగాత్రులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాద కారకులు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వారికి ఎలాంటి సాయమైనా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని ఆయన వెల్లడించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు.