: అయ్యప్ప సొసైటీకి కరెంట్ కట్, నీటి సరఫరా బంద్
హైదరాబాదు హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న అయ్యప్ప సొసైటీలో గత రెండు, మూడు రోజులుగా జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. సొసైటీలోని పలు అక్రమ నిర్మాణాలకు ఇవాళ మంచినీటి కనెక్షన్, కరెంట్ కట్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయా నిర్మాణాలకు సీలు వేసి నోటీసులు అంటించారు. ఆక్రమణలను ఉపేక్షించేది లేదని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.