: ఆన్ లైన్ లో కొనేటప్పుడు జాగ్రత్త: ఆసుస్ హెచ్చరిక
ఆన్ లైన్ షాపింగ్ సైట్లలో తమ కంపెనీ ఉత్పత్తులను కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుస్ కంపెనీ సూచించింది. కొనే ముందు, కొన్న తర్వాత నియమ నిబంధనలు, ఉత్పత్తి నాణ్యత, కచ్చితత్వం గురించి తెలుసుకోవాలని సూచించింది. ఇప్పటికే లెనోవో, జియోనీ కంపెనీలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వినియోగదారులు తమ కంపెనీ ఉత్పత్తులు కొన్న తర్వాత తగిన సేవలను పొందగలరని... అందుకని కొనే ముందు వస్తువు అసలైనదా, కాదా తెలుసుకోవాలని సూచించింది.