: కోర్టుకు హాజరైన ఎయిర్ టెల్ అధినేత
ఎన్ డిఎ హయాంలో జరిగిన అదనపు స్పెక్ట్రం కేటాయింపుల అక్రమాల కేసు విచారణకు ఎయిర్ టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్, ఎస్సార్ గ్రూప్ వైస్ చైర్మన్ రవి రూయా(నాడు హచ్ సెల్యులర్ కు అధినేతగా ఉన్నారు), నాడు టెలికాం శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన శ్యామల్ ఘోష్ ఈ రోజు ఢిల్లీ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.