: ఢిల్లీలో నాలుగు మెట్రో స్టేషన్లు మూసివేత
ఢిల్లీలోని నాలుగు మెట్రో స్టేషన్లను నిరవధికంగా మూసివేసినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధానమంత్రి ఇంటి ఎదుట వందలమంది విద్యార్థులు నిరసన చేస్తున్నారని తెలిపారు. ఈ కారణంగానే పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రేస్ కోర్స్ రోడ్, ఉద్యోగ్ భవన్ లోని స్టేషన్లు మూసి వేయాల్సి వచ్చిందన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు... సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్ (ప్రిలిమినరీ) నమూనాలో మార్పు చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో, ఉత్తర ఢిల్లీలో దాదాపు మూడువేల మంది విద్యార్థులు ఓ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అల్లర్లు జరుగుతాయని ఊహించి స్టేషన్లు మూసివేశారు.