: పేలుడు ఘటనలో 9 మందిని రక్షించిన డీఎస్పీ వీరారెడ్డి


తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో సంభవించిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. గుర్తుపట్టలేనంతగా మృత దేహాలు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ వీరారెడ్డి హుటాహుటిన బయల్దేరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ 9 మందిని రక్షించారని స్థానికులు చెప్పారు. అయితే, ఈ ప్రయత్నంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం జరిగిందని తెలుస్తోంది. కార్లు, బైక్ లు, సమీప నివాసాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి.

  • Loading...

More Telugu News