: ప్రీతీ జింటాను నెస్ వాడియా లాగడం చూశానంటున్న సాక్షి!


బాలీవుడ్ నటి ప్రీతీజింటా, వ్యాపారవేత్త నెస్ వాడియా కేసులో ముంబయి పోలీసుల దర్యాప్తు, విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన జై కనోజియాను సాక్షిగా విచారించారు. ఈ సందర్భంగా, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని గార్వార్ పెవిలియన్ లో ప్రీతీని నెస్ లాగడం చూశానని తెలిపాడు. ఆయితే, ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను పెవిలియన్ లో నెలకొన్న గందరగోళంతో వినలేకపోయానని వెల్లడించాడు. ఈ కేసులో తొమ్మిదవ సాక్షిగా జై ఇచ్చిన వాంగ్మూలాన్ని తొలగించవచ్చని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. కేవలం పరుల్ ఖన్నా, జర్నలిస్టు శైలేష్ గుప్త, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీఓఓ ఫ్రేజర్ క్యాస్టెల్లినో, 'తారా'ల సాక్ష్యాలను మాత్రమే రికార్డు చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వారిలో ఖన్నా, గుప్తాలను ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ కు జింటా ఆహ్వానించారన్నారు.

  • Loading...

More Telugu News