: రఘువీరా ఉగాది మౌనదీక్ష
విశ్వమానవ శ్రేయస్సు కోసం మంత్రి రఘువీరా ఒక రోజు మౌనదీక్ష చేస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో గాంధీ విగ్రహం ముందు ఈ రోజు ఉదయం ఆయన దీక్ష ప్రారంభించారు. రఘువీరా మానవశ్రేయస్సు కోసం దీక్ష చేయడం ఇదే మొదటిసారి కాదు. 1995 నుంచీ ఏటా ఉగాది పండుగ నాడు ఇలా దీక్ష చేస్తూనే ఉన్నారు.