: మరోసారి గీత దాటిన పాక్
కాశ్మీర్ వద్ద సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ, పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద భారత దళాలపై కాల్పులు జరిపింది. గత అర్ధరాత్రి వేళ భింభేర్ గలి-గంభీర్ పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులకు దిగడంతో భారత దళాలు ప్రతిదాడికి దిగాయి. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టాయి.