: రాష్ట్రపతి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా షాక్కొట్టే బ్రా
అత్యాచారాల సమయంలో మహిళలకు రక్షణగా దుండగులను మట్టికరిపించే బ్రా ఒకటి రాష్ట్రపతి ఇన్నోవేటివ్ పరిశోధకుల కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జూలై 1 నుంచి 20 వరకు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఇందులో చండీగఢ్ కు చెందిన మనీషా మోహన్ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణ కానుంది. డిసెంబర్ 16, 2012 ఢిల్లీలో సామూహిక అత్యాచార దారుణం మోహన్ ను ఆలోచనలో పడేసింది. దాంతో మహిళల రక్షణ కోసం ఓ బ్రాను తయారు చేశాడు. ఇది ధరించిన మహిళపై ఎవరైనా అగంతకులు దాడికి ప్రయత్నిస్తే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. చర్మంపై కాలిన గాయాలు కూడా అవుతాయి.