: అమెజాన్ తో ఇన్ఫోసిస్ మూర్తి జాయింట్ వెంచర్?


ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి త్వరలో భారత్ లో ఈ కామర్స్ జాయింట్ వెంచర్ లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అమెజాన్ డాట్ కామ్ లో తన కాటమారాన్ వెంచర్స్ నుంచి ఇన్వెస్ట్ చేయనున్నారంటూ ఓ ఆంగ్ల దిన పత్రిక వెల్లడించింది. అటు కాటమారాన్ కూడా అమెజాన్ ఆసియాతో జాయింట్ వెంచర్ ప్రణాళిక చేస్తున్నట్లు ధ్రువీకరించిందని తెలిపింది. దీనిపై అమెజాన్, కాటమారాన్ స్పందించేందుకు అందుబాటులో లేవని పేర్కొంది. భారతదేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ప్రకారం ఈ వ్యాపారంలో 51 శాతం వాటాను కాటమారాన్ తన వద్దే పెట్టుకోనుందని పత్రిక వివరించింది. భారత్ లో అతిపెద్ద అవుట్ సోర్సింగ్ సర్వీస్ లో ఇన్ఫోసిస్ ను టాప్ పొజిషన్ లో నిలిపిన మూర్తి... తాజాగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News