: అంత పెద్ద ప్రమాదం జరిగిందా?: రాష్ట్రపతి ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిందని తెలియగానే గవర్నర్ నరసింహన్ కు ఫోన్ చేశారు. పది అడుగుల గొయ్యి పడిందని తెలుసుకుని ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యంత్రాంగం మొత్తం బాధితులకు సహాయకచర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.