: నాగార్జున బిల్డింగ్ ను కూడా కేసీఆర్ నేలమట్టం చేయిస్తారా?


హైదరాబాదులోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సెలబ్రిటీల నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన జీహెచ్ఎంసీ మరికొన్ని నిర్మాణాల యజమానులకు నోటీసులు పంపింది. అలా నోటీసు అందుకున్న వారిలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రస్ట్ భూముల్లో నాగ్ కు చెందిన వాణిజ్య సముదాయం కూడా ఉండడంతో అందరి దృష్టి ఇటు మళ్ళింది.

అసైన్డ్ భూముల్లో నిర్మితమైన ఈ కాంప్లెక్స్ ద్వారా నాగ్ కు నెలకు కోటి రూపాయలు వస్తున్నట్టు టాక్. తాజాగా, కేసీఆర్ కఠిన వైఖరి అవలంబిస్తుండడంతో నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం అవకతప్పదని ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News