: 'వికీలీక్స్' సారధి క్యాట్ వాక్!


అగ్రరాజ్యం అమెరికా, భారతదేశానికి సంబంధించిన రహస్య విషయాలను వికీలీక్స్ కేబుల్స్ ద్వారా ప్రపంచానికి వెల్లడించి వణుకు పుట్టించిన జూలియన్ అసాంజే అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడాయన గురించెందుకు చెబుతున్నారని ఆలోచిస్తున్నారు కదా? త్వరలో ఆయన గారు మోడల్ గా ర్యాంపుపై క్యాట్ వాక్ చేయనున్నారు. సెప్టెంబర్ లో లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఫ్యాషన్ వీక్ జరగనుంది. అందులోనే అసాంజే హొయలొలికిస్తూ వచ్చిన వారిని అలరించనున్నారు.

ప్రముఖ ఇంగ్లీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియన్నే వెస్ట్ ఉడ్ కుమారుడు బెన్ వెస్ట్ ఉడ్ కోసం ఆయన క్యాట్ వాక్ చేయనున్నారు. రెండేళ్ల నుంచి లండన్ లో ఉంటున్న అసాంజే పరిస్థితి గురించి ఈ సమయంలో ప్రపంచానికి తెలియజేస్తామని మద్దతుదారులు అంటున్నారు. ఈ షోలో జూలియన్ స్థితిగతులను హైలైట్ చేయాలనుకుంటున్నానని, ఆయన విషయంలో జరిగిందంతా పూర్తిగా అన్యాయమని బెన్ వెస్ట్ ఉడ్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News