: ఇది మరో మొద్దు శీను కథ!


అప్పట్లో సూరి బావ కళ్ళల్లో ఆనందం చూడాలని, చేయరానివన్నీ చేసి చివరికి తన ప్రాణాలను పోగొట్టుకున్న మొద్దు శీను కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడలాంటి ఉదంతమే కృష్ణాజిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన నానమ్మ చివరి కోరిక తీర్చి, ఆమె ఆత్మ శాంతి కోసం ఏకంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే... 1998లో లింగినేని సాంబశివరావు అనే వ్యక్తి ఘంటసాల గ్రామంలో హత్యకు గురయ్యాడు. మద్యం దుకాణం వ్యవహారంలో తలెత్తిన వివాదం ఈ హత్యకు దారితీసింది. ఈ కేసులో సూర్యచంద్రరావు అనే వ్యక్తి కూడా నిందితుడు. అయితే, కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో నిందితులందరూ బయటికొచ్చారు.

కానీ, తన కుమారుడి హత్యతో రగిలిపోతున్న సాంబశివరావు తల్లి గుంటూరు జిల్లా లింగమనేనివారి పాలెంలో నివాసం ఏర్పరచుకుంది. కుమారుడి ఫొటోకు నిత్యం పూజలు చేస్తూ కాలం వెళ్ళదీసేది. ఆమె వద్ద మనవడు రాజా కూడా ఆమెతో బాటే ఉండేవాడు. సాంబశివరావు హత్య గురించి పదేపదే రాజాతో చెబుతూ, హంతకులను నరికి చంపాలని ఉద్బోధిస్తూ ఉండేది. దీంతో, రాజాలోనూ ప్రతీకారేచ్ఛ మొదలైంది. బామ్మ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాడు. ఈలోపు వెంకట నరసమ్మ మరణించింది. అనంతరం, వివాహం చేసుకున్న రాజా అదను కోసం చూడసాగాడు.

ఓ రోజు సూర్యచంద్రరావు వంగతోటకు నీరు పెట్టేందుకు వెళ్ళాడన్న విషయం రాజాకి తెలిసింది. ఇదే సమయమని భావించిన రాజా కత్తితో పొడిచాడు. ఆ కత్తి విరిగిపోవడంతో సూర్యచంద్రరావు వద్ద ఉన్న కత్తితో మరికొన్ని పోట్లు పొడిచాడు. దీంతో, సూర్యచంద్రరావు అక్కడిక్కడే హతమవగా, రాజా పరారయ్యాడు. గాలింపు చేపట్టిన పోలీసులు నిమ్మగడ్డ లాకుల వద్ద రాజాను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News