: ఆరేళ్లకే బుడతడు పాఠాలు


హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతానికి చెందిన ఆరేళ్ల కౌటిల్య అనే కుర్రాడు తన వయసున్న తోటి విద్యార్థులకే పాఠాలు బోధించనున్నాడు. అదీ తన పేరిట తండ్రి ఏర్పాటు చేసిన అకాడమీలోనే. తన కుమారుడు కౌటిల్యుని ప్రతిభను గుర్తించిన అతడి తండ్రి సతీష్ శర్మ గూగుల్ బోయ్ అకాడమీ ఫర్ ఎక్స్ లెన్స్ పేరుతో ఓ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు చేశాడు. ఇది వచ్చే నెలలో ప్రారంభం అవుతోంది. ఇందులో విద్యార్థులకు పాఠాలు ఎలా గుర్తుంచుకోవాలన్న దానిపై కౌటిల్యుడు చిట్కాలు చెప్పనున్నాడు. భౌగోళిక స్వరూపం, దేశాల సరిహద్దులు, ప్రాణి ప్రపంచం, సహజ వనరుల వివరాలను 5 ఏళ్ల 8 నెలల వయసు నుంచే ఇతడు అవలీలగా చెబుతున్నాడు. దీంతో ఇతడికి గూగుల్ బోయ్ అనే పేరు పడింది.

  • Loading...

More Telugu News