: గ్యాస్ పైప్ లైన్ పేలుడు మృతుల కుటుంబాలకు ప్రధాని ఆర్థిక సాయం


తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఈ ఉదయం జరిగిన గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సాయం ప్రకటించారు. సజీవదహనం అయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ప్రకటించారు. ఈ సాయం ప్రధాని సహాయనిధి నుంచి అందుతుంది.

  • Loading...

More Telugu News